AKP: ఈనెల 16, 17, 18వ తేదీల్లో విశాఖలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది సత్తా చాటి పథకాలు సాధించారు. వీరిని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సుధీర్ శుక్రవారం తన కార్యాలయంలో అభినందించారు. సిబ్బంది ఫిట్నెస్ కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడతాయన్నారు.