TPT: పాకాల(M) నేండ్ర గుంట సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. కొత్తూరుకు చెందిన రామకృష్ణారెడ్డి ఆవుని తీసుకుని రోడ్డు దాటుచుండగా తిరుపతి వైపు వెళ్తున కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన రామకృష్ణారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.