TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. నిన్న గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభమవగా.. ఇవాళ ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈనెల 20న ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మూసీ పునరుజ్జీవం, రైతు భరోసా వంటి కీలక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చలు జరిగే అవకాశం ఉంది.