TG: HYD కూకట్‌పల్లిలో భారీ దోపిడీ జరిగింది. డబ్బులు తీసుకెళ్తున్న వ్యక్తులపై దుండగులు కారం చల్లి కోటి రూపాయలతో పరారయ్యారు. బహదూర్‌పురాకు చెందిన కుస్రు, అజీముద్దీన్ డబ్బు తీసుకుని వెళ్తుండగా.. నలుగురు వ్యక్తులు బైకులపై వచ్చి కళ్లలో కారం చల్లి నగదుతో పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.