తూ.గో: తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామానికి చెందిన తమ్మినేని ఆనందరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అగ్నిమాపక సేవా పతకానికి ఎంపికయ్యారు. 2011లో భీమవరం అగ్నిమాపక కేంద్రంలో ఫైర్మెన్గా వృత్తి ప్రారంభించిన ఆయన, ప్రస్తుతం నిడదవోలు, కొవ్వూరు కేంద్రాల్లో విశిష్ఠ సేవలు అందిస్తున్నారు. ఈ సేవా మెడల్ లభించడం పట్ల స్థానికులు, తోటి సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.