TG: తాను పార్టీని వీడటం ఖాయమేనని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ జీవన్‌రెడ్డి చెప్పారు. తాను అందరితో చర్చించి పార్టీని వీడే నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. ఇతర పార్టీల్లో చేరే విషయం ఆలోచించలేదని తెలిపారు. వ్యక్తిగత లబ్ధి కోసం కాకుండా సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తినిని అన్నారు. ఈ ప్రకటనతో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.