అన్నమయ్య: జిల్లా రామాపురం మండలం, నల్లగుట్టపల్లి బీసీ కాలనీలో సోమవారం రైతన్నా మీకోసం కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇంటింటికీ తిరిగి రైతులను కలిసి, అన్నదాత సుఖీభవ పథకం కింద అందుతున్న నిధుల గురించి ఆరా తీశారు.