AP: ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం రేపటి నుంచి ప్రారంభం కానుంది. గుంటూరు బస్టాండులో సీఎం చంద్రబాబు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభిస్తారు. స్త్రీశక్తి పథకం కింద పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఆయా బస్సుల్లోనూ దివ్యాంగులను అనుమతిస్తారు.