SGR: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను ఎస్పీ పరితోష్ పంకజ్ విన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది తమ ఫిర్యాదులను వివరించారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల SIలు, సీఐలకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.