Amritpal Singh ఇలా తప్పించుకున్నాడు.. సీసీటీవీ ఫుటేజీ ఇదిగో..?
Amritpal Singh:వారిస్ పంజాబీ డే చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ఎలా పారిపోయాడు. 50 నుంచి 100 పోలీసు వాహనాలతో వెంబడించగా కనిపించకుండా ఎలా వెళ్లిపోయాడు. హర్యానా హైకోర్టు (High court) కూడా పోలీసులకు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. సింగ్ పారిపోయిన ఘటనకు సంబంధించి ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ ఓ వీడియో ప్లే చేసింది.
How Amritpal Singh escaped.. see this CCTV footage
Amritpal Singh:వారిస్ పంజాబీ డే చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ఎలా పారిపోయాడు. 50 నుంచి 100 పోలీసు వాహనాలతో వెంబడించగా కనిపించకుండా ఎలా వెళ్లిపోయాడు. హర్యానా హైకోర్టు (High court) కూడా పోలీసులకు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. సింగ్ పారిపోయిన ఘటనకు సంబంధించి ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ ఓ వీడియో ప్లే చేసింది. అందులో సింగ్ ఎలా తప్పించుకున్నాడో వివరించింది. కార్లు మార్చి.. డ్రెస్ ఛేంజ్ చేసి.. బైక్ మీద పంజాబ్ సరిహద్దు దాటాడని తెలిపింది.
సింగ్ (singh) కోసం పంజాబ్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. ఇంతలో సీసీటీవీ ఫుటేజీని ప్లే చేశారు. సింగ్ కాన్వాయ్‌లో మూడు కార్లు ఉన్నాయి. అందులో సింగ్‌ది బెంజ్ కారు.. కాగా టోల్ గేట్ దాటే సమయంలో మాత్రం బ్రెజ్జా కారు కనిపించింది. అంటే బెంజ్ కారు కాకుండా.. బ్రెజ్జాలో సింగ్ పారిపోయాడు. దీంతో సిబ్బంది కూడా అతనిని గమనించే వీలు లేకుండా పోయింది.
మరోవైపు నిన్న సింగ్ ఓ కారు లభించింది. అందులో అతని డ్రెసు కూడా ఉన్నాయి. అంటే కారులోనే బట్టలు మార్చుకొని.. బెంజ్ కారు నుంచి బ్రెజ్జాలోకి వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. బ్రెజ్జాలో షాకోట్ పారిపోయి.. అక్కడ బట్టలు మార్చుకున్నాడని అనుమానిస్తున్నాడు. టూ వీలర్‌పై పంజాబ్ నుంచి తప్పించుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.
ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. ఈ ఘటనపై హర్యానా హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. 80 వేల మంది పోలీసులు (80 thousand cops) ఏం చేస్తున్నారు అని ప్రశ్నించింది. ఇంత మంది ఉండగా.. ఆయన ఎలా తప్పించుకున్నారని ధర్మాసనం అడిగింది. ఇదీ ముమ్మాటికీ పోలీసుల నిఘా వైఫల్యమేనని స్పష్టంచేసింది.