Happy Ugadi అని విష్ చేసిన సీఎంలు జగన్, కేసీఆర్.. పవన్ కల్యాణ్ కూడా
Happy Ugadi:మరికొన్ని గంటల్లో తెలుగు లోగిళ్లకు కొత్త శోభ రానుంది. బుధవారం తెలుగు నూతన సంవత్సరాది ఉగాది (Ugadi) పండగ. ఫెస్టివల్ కోసం మహిళలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రముఖులు విష్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు (cm), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ (kcr) ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఉగాది రైతులు, ప్రజలు.. అందిరికీ శుభం చేకూర్చాలని కోరారు. పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొందన్నారు. వ్యవసాయ రంగం అభివృద్దితో అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందన్నారు. తెలంగాణ (telangana) అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలకు శుభం జరగాలని ఏపీ సీఎం జగన్ (jagan) ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్దిగా కురవాలని కోరుకున్నారు. రైతులకు (farmers) మేలు జరగాలని.. ప్రతీ ఇల్లు కళకళలాడాలని తెలిపారు. తెలుగు సంస్కృతి వెల్లివిరియాలని అన్నారు.
ఉగాది (ugadi) సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులు (farmers), కార్మికులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు, విద్యార్థులు (students), ఉపాధ్యాయులు (teachers), ఉద్యోగులు, సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది (ugadi) రోజున కుటుంబాలు శోభాయమానం కావాలని ఆకాంక్షించారు. తెలుగు సంవత్సరం ప్రజలకు ఆరోగ్యం, సిరిసంపద ప్రసాదించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.