»Chandrababu Make Skill In The Skill Development Scamminister Venu
skill scam:చంద్రబాబు స్కిల్ ప్రదర్శించారు: మంత్రి చెల్లుబోయిన వేణు
skill scam:విపక్ష నేత చంద్రబాబు నాయుడిపై (chandrababu) ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (venu gopala krishna) ఫైరయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై భారీ దోపిడి జరిగిందని ఆరోపించారు. ఇందులో చంద్రబాబు (chandrababu) తన స్కిల్ ప్రదర్శించారని సెటైర్లు వేశారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు (chandrababu) ప్రధాన నిందితుడిగా చేర్చి.. అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
chandrababu has make skill in the skill scam:minister venu
skill scam:విపక్ష నేత చంద్రబాబు నాయుడిపై (chandrababu) ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (venu gopala krishna) ఫైరయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై భారీ దోపిడి జరిగిందని ఆరోపించారు. ఇందులో చంద్రబాబు (chandrababu) తన స్కిల్ ప్రదర్శించారని సెటైర్లు వేశారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు (chandrababu) ప్రధాన నిందితుడిగా చేర్చి.. అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. స్కామ్‌లో చంద్రబాబుతో (chandrababu) భాగస్వాములైన అందరినీ అరెస్ట్ చేయాల్సిందేనని స్పష్టంచేశారు. స్కామ్‌పై చర్చ జరగకూడదనే సభలో టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారని మంత్రి వేణుగోపాల కృష్ణ ఆరోపించారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో 371 కోట్ల కుంభకోణం జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి కలిపిస్తాననే ముసుగులో చంద్రబాబు (Chandrababu) కుంభకోణానికి పాల్పడ్డారని అంటున్నారు. చంద్రబాబుతోపాటు (chandrababu) లోకేశ్(Lokesh) జైలుకు వెళ్లడం ఖాయం అంటున్నాన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ చంద్రబాబు (chandrababu) నైపుణ్యతకు ఉదాహరణ అని చెబుతున్నారు. ఒక ప్రైవేటు సంస్థ 90 శాతం నిధులు ఎలా కేటాయిస్తుందనే అనుమానం ఎవరికైనా వస్తుందని కొశ్చన్ చేస్తున్నారు.
యువతకు నైపుణ్యాభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. ‘యూరో లాటరీ మాదిరిగా టీడీపీ (TDP) హయాంలో షెల్ కంపెనీలతో కలిసి సింగపూర్ కేంద్రంగా స్కాం జరిగింది. సీమెన్స్ సంస్థకు లేఖ రాస్తే అంత తక్కువ పెట్టుబడికి అంత ఎక్కువ ఎలా పెడతామని సమాధానం ఇచ్చారు. డిజైన్ టెక్ కంపెనీకి రూ. 185 కోట్ల సింగిల్ ట్రాన్స్ఫర్ జరిగింది. చంద్రబాబు (chandrababu) ఆదేశాలతో నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రిన్పిపల్ సెక్రటరీ స్వయంగా జీవో విడుదల చేశారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
సింగపూర్‌కు చెందిన స్కిల్లర్, ఇన్ వెబ్ సొల్యూషన్స్ వంటి ఆరు షెల్ కంపెనీలు చూపించారని, 371.25 కోట్ల రూపాయలను ఆయా కంపెనీలకు చంద్రబాబు (chandrababu) తరలించారని మంత్రి అమర్నాథ్ అన్నారు. స్కిల్లర్ కంపెనికి 185 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని తెలిపారు. రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా ఈ కంపెనీలకు డబ్బులు బదిలీ చేసి.. కీలక పత్రాలను మాయం చేశాయట.