»Chandrababu Revanth Reddy The Meeting Of Telugu States Cms Begins
Chandrababu-Revanth Reddy: తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో భేటీ అయ్యారు. మొదట ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాపై ప్రధానంగా చర్చించనున్నారు.
Chandrababu-Revanth Reddy: The meeting of Telugu states CMs begins
Chandrababu-Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో భేటీ అయ్యారు. మొదట ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాపై ప్రధానంగా చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్, పొన్నం ప్రభాకర్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆంధప్రదేశ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారులు భవనాలశాఖ మంత్రి బి.సి.జనార్దన్ రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్‌తో పాటు ఇతర శాఖల అధికారులు కూడా హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ జరిగి పదేళ్లు అయ్యింది. అప్పటి ఎన్నో అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ఉమ్మడిగా ఎజెండా అంశాలను ఖరారు చేశారు. అవి.. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్తు బిల్లులు, విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు.. వాటి అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు, హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే అంశం, లేబర్ సెస్ పంపకాలు, ఉద్యోగుల విభజన అంశాలు గురించి చర్చించనున్నారు.