Chandrababu: Ministers should realize that there is a deficit budget and work
Chandrababu: మంత్రులు, ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. కేబినెట్ భేటీ అనంతరం వీటిపై చర్చించారు. అక్టోబరు తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నాం. డంప్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక ఉంది. వచ్చే 3 నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరమని తెలిపారు. నదుల్లో పూడిక, బోట్ సొసైటీల ద్వారా 80లక్షల టన్నుల ఇసుక వస్తుందని తెలిపారు.
కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అలాగే లోటు బడ్జెట్ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలన్నారు. శాఖల సంబంధిత అంశాలపై ప్రతినెలా సమీక్ష చేయాలన్నారు. మంత్రులు తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలని తెలిపారు. వివాదాలు లేకుండా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతులను మోసం చేసిందని చంద్రబాబు అన్నారు.