ప్రస్తుతం అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ కాగా.. అది ఫేక్ అని తేలిపోయింది.
Rajashab: బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న మీడియం బడ్జెట్ సినిమా ఏదైనా ఉందా? అంటే, అది రాజాసాబ్ మాత్రమే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కల్కి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా ఇదే. దీంతో.. రాజాసాబ్ పై మంచి హైప్ ఉంది. వాస్తవానికైతే.. మారుతితో సినిమా అనగానే వద్దని వాదించారు రెబల్ ఫ్యాన్స్. కానీ డార్లింగ్ మాత్రం సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోయాడు.
మారుతి కూడా ఫస్ట్ లుక్‌తో రెబల్స్‌ని మెప్పించాడు. వింటేజ్ డార్లింగ్‌ను చూపిస్తానని చెబుతున్నాడు. దీంతో.. రాజాసాబ్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. లేటెస్ట్గా.. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ అమితాబ్ బచ్చన్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ‘ఓ కైకే పాన్ బనారస్ వాలా’ని రీమిక్స్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పటికే ఈ రీమిక్స్ సాంగ్‌ను అదిరిపోయేట్టుగా ప్లాన్ చేస్తున్నాడని అన్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది.
బేబీ సినిమా నిర్మాత ఎస్కెఎన్ మారుతికి మంచి ఫ్రెండ్ అనే సంగతి తెలిసిందే. దీంతో.. రాజాసాబ్ రీమిక్స్ వార్తల్లో ఎలాంటి నిజం లేదు, తప్పుడు సమాచారం.. అంటూ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. దీంతో.. రాజసాబ్ రీమిక్స్ అంతా ఫేక్ అని తేలిపోయింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.