»Telangana High Court Issue Orders On Margadarsi Chit Funds
Telangana high courtలో మార్గదర్శి చిట్ ఫండ్స్‌కు ఊరట
Telangana high court:మార్గదర్శి (margadarsi) చిట్ ఫండ్స్ నిధుల బదిలీ విషయంలో ఆ సంస్థకు తెలంగాణహైకోర్టులో (Telangana high court) ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో (andhra pradesh) మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆఫీసుల్లో ఏపీ సీఐడీ (ap cid) ఇటీవల తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో మార్గదర్శి చైర్మన్ రామోజీరావు (ramoji rao), ఎండీ శైలాజా కిరణ్ (sailaja kiran) తెలంగాణ హైకోర్టును (high court) ఆశ్రయించారు.
Telangana high court issue orders on margadarsi chit funds
Telangana high court:మార్గదర్శి (margadarsi) చిట్ ఫండ్స్ నిధుల బదిలీ విషయంలో ఆ సంస్థకు తెలంగాణహైకోర్టులో (Telangana high court) ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో (andhra pradesh) మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆఫీసుల్లో ఏపీ సీఐడీ (ap cid) ఇటీవల తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో మార్గదర్శి చైర్మన్ రామోజీరావు (ramoji rao), ఎండీ శైలాజా కిరణ్ (sailaja kiran) తెలంగాణ హైకోర్టును (high court) ఆశ్రయించారు. తమ సంస్థలో సోదాల గురించి వివరించారు. రామోజీరావు (ramoji rao) తరఫున సుప్రీంకోర్టు (supreme court) సీనియర్ లాయర్ సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
తమ క్లైంట్‌పై వేధింపులకు పాల్పడుతున్నారని.. కావాలనే సోదాలు జరిగాయని సిద్దార్థ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. చిట్ ఫండ్ (chit fund) నిధులను బ్యాంకులో (bank) జమ చేయాలి కానీ.. మ్యుచువల్ ఫండ్స్‌కు మళ్లించడంపై ఏపీ సీఐడీ (ap cid) అధికారులు ప్రశ్నించారు. దీనిపై ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. నిధులు బదిలీ చేస్తే.. దుర్వినియోగం అనలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఖాతాదారులను మోసం చేశారని అనలేదని పేర్కొంది.
అంతేకాదు మార్గదర్శికి (margadarsi) సంబంధించి ఖాతాదారులు ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. మరీ అలాంటి సమయంలో ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగడంపై హైకోర్టు (high court) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రామోజీరావు, శైలాజా కిరణ్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు (high court) స్పష్టంచేసింది. దీంతో ఏపీ సీఐడీ సోదాల నుంచి మార్గదర్శికి సోదాలు తప్పినట్టు అయ్యింది.
ఇదే విషయంపై గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ (arun kumar) చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. కోర్టులో (court) పిటిషన్ కూడా ఫైల్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఏపీ సీఐడీ అధికారులు (ap cid) ఏకంగా సోదాలు చేయడంతో.. హైకోర్టుకు (high court) పిటిషన్ రావడంతో ఈ మేరకు స్పందించింది.