MDK: మెదక్ పట్టణ మున్సిపాలిటీలో త్వరలో సాండ్ బజార్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇప్పటికే 10 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాకు వచ్చినట్లు వివరించారు. సాండ్ బజార్ వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సాండ్ బజార్ ఏర్పాటుతో అక్రమ ఇసుక రవాణాకు చెక్ పెడుతున్నట్లు వెల్లడించారు.