VSP: ఏయూ సమస్యలను తెలుసుకునేందుకు ఏఐసీసీ జాతీయ ప్రతినిధి సునీల్ అహిరా, కాంగ్రెస్ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రియాంక దండి కలిసి విశ్వవిద్యాలయంలో ఇవాళ పర్యటించారు. రీడింగ్ రూమ్లో విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక అవేదన వ్యక్తం చేశారు. సదుపాయాల లోపంతో విద్యార్థి మరణం జరిగిందని, విద్యార్థి సంఘం ఎన్నికలు ఆపివేయడం దుర్మార్గమని వారు తెలిపారు.