TG: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు మెట్రో రైల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను డబ్ల్యూజేఐ నేతలు కోరారు. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద జర్నలిస్టులకు రాయితీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హత గల పత్రికలకు పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్ కార్డు పెంచాలని కోరారు.