ASR: డుంబ్రిగూడ మండలంలోని కొరాయి, తోటవలస గ్రామాల్లో ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ ఆదివాసులపై జరుగుతున్న అన్యాయాలు, సమస్యలను ప్రజలకు వివరించారు. హైడ్రోపవర్ ప్రాజెక్టులను రద్దు చేయాలని, స్థానిక ఆదివాసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.