VSP: కాపులప్పాడ సర్వేనెంబర్ 295/9 లో సముద్ర తీరానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూమి లో భూ కబ్జాదారులు పెద్దపెద్ద ట్యాంకులు పెట్టి నెట్ వాల్ ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో స్థానికులు భీమిలి ఎమ్మార్వో కి ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైయినట్లు తెలిపారు. అనంతరం ఆయన ప్రభుత్వానికి తెలియాజేసి,హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.