WGL: గీసుకొండ మండలంలోని గ్రామాల్లో వరుసగా జరుగుతున్న గొర్రెల దొంగతనాల కేసులో ఐదుగురు సభ్యుల ముఠాను గురువారం గీసుగొండ పోలీసులు అరెస్టు చేశారు. సెల్ఫ్ డ్రైవ్ కార్లతో రాత్రివేళ రెక్కీ చేసి గొర్రెలను దొంగిలించి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుల వద్ద నుంచి రూ.1.60 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.