WNP: గోపాల్ పేట మండల కేంద్రములో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రెండు గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జీర్ణించుకోలేని ఎమ్మెల్యే కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని అన్నారు. దళితులపై చిన్న చూపు చూస్తుందని, ఇదేనా దళితులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ అని గట్టు యాదవ్ ప్రశ్నించారు.