VZM: చీపురుపల్లి మండలం పెదనడిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని ఇందు జాతీయ స్థాయిలో నిర్వహించిన 42వ జాతీయ టెన్నికాయిట్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ మండల నేతలు వరహాలనాయుడు, అనంతం, శ్రీనివాస్, తదితరులు ఇందును ఇవాళ ఘనంగా సత్కరించారు. ఇందును తోటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.