HYD: రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ డిసెంబర్ 7న HYD ఇందిరాపార్క్ వద్ద బీజేపీ తెలంగాణ ఆధ్వర్యంలో ‘ప్రజా వంచన దినం’ పేరుతో మహాధర్నా నిర్వహించనున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ధర్నా చేపట్టనున్నామన్నారు.