MHBD: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి అండర్-14 క్రికెట్ పోటీలకు పట్టణానికి చెందిన అఖీరా నందన్, హృషికేష్ ఎంపికైనట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోచ్ మెతుకు కుమార్ తెలిపారు. ఇటీవల జరిగిన ఉమ్మడి జిల్లాల క్రికెట్ పోటీల్లో ఈ ఇద్దరు మంచి ప్రతిభ కనపరిచారన్నారు. త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో సైతం ప్రతిభ కనబరచాలని కోరారు.