WGL: రాష్ట్రంలో రవాణా వ్యవస్థ విస్తరణ, రోడ్లకు నిధుల కేటాయింపు, జాతీయ రహదారులపై పెరుగుతున్న ప్రమాదాల నియంత్రణ అంశాలపై పార్లమెంటులో ఎంపీ కడియం కావ్య ప్రశ్నించారు. తెలంగాణలో రవాణా విస్తరణ-రోడ్డు భద్రతపై కేంద్రం పటిష్ఠ చర్యలు చేపట్టాలని, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు.