NLG: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మూడో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. కోల్ముంతల్ పహాడ్ తండాలో నామినేషన్ ప్రక్రియ, భద్రతా చర్యలను పరిశీలించిన ఎస్పీ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 100 మీటర్ల పరిధి నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.