ప్రకాశం: మార్కాపురం సబ్ జైల్ను జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఇబ్రహీం షరీఫ్ తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా వంటశాల, స్టోర్ రూమ్, ఖైదీలు ఉండే గదులను పరిశీలించారు. ఖైదీల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. న్యాయ సహాయం కావలసినవారు మండల లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదిస్తే ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని ఖైదీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది ఉషశ్రీ పాల్గొన్నారు.