ఫాబ్-4 ప్లేయర్లలో ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్ దూసుకెళ్తున్నాడు. గత 4 ఏళ్లుగా టెస్టుల్లో అద్భుత ఫామ్‌తో సెంచరీల వర్షం కురిపిస్తున్నాడు. ప్రస్తుతం రూట్ టెస్టుల్లో 40 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. స్మిత్-36, విలియమ్సన్-33, కోహ్లీ-30(రిటైర్డ్) సెంచరీలతో నిలిచారు. రూట్ మరో 12 సెంచరీలు సాధిస్తే, సచిన్(51) పేరిట ఉన్న టెస్టు సెంచరీల రికార్డును అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంటాడు.