NLG: చిట్యాల శివారులోని ఐడియల్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు గదిలో నిద్రిస్తూ గుండెపోటుతో గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన మనోజ్ జన(42) గుండెపోటు రాగా సమీపంలో ఉన్న నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడి భార్య గీత జన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.