బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అఖండ 2’. ఈ చిత్రం రేపు విడుదల కానుండగా, ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అనుమతినిచ్చాయి. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.