KRNL: చిప్పగిరి పోలీసు స్టేషన్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సంధర్బంగా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు, వాటి పురోగతిపై ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.