ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం సమీపంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. డోర్నకల్‌కు చెందిన మునగల వీరభద్రం(55) స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరభద్రంకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ రాజు ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.