VZM: డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో నలుగురు నిందితులను విజయనగరం రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 3 కార్లు, 4 మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 23న విశాఖకు చెందిన మహేష్ కుమార్ యాదవ్‌ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.