మెదక్ DMHO డాక్టర్ శ్రీరామ్ గురువారం మనోహరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తనిఖీ చేశారు. పలు వార్డులు, ల్యాబ్లు, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సూచనలు చేశారు. అలాగే, గర్భిణులకు అవసరమైన సేవలు ఆశ కార్యకర్తలు అందించాలని ఆయన కోరారు.