MDK: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సీసీలు రాజేందర్, రవీందర్ తెలిపారు. ఈ క్రమంలో నిజాంపేట మండలం తిప్పినగుళ్ల, నార్లపూర్, బచ్చురాజ్ పల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు రైతులను దళార్లకు అలా నమ్మి ధాన్యాన్ని తక్కువ ధరలకు విక్రయించకుండా ఉండమని సూచించారు.