ప్రకాశం: ఎస్పీ హర్షవర్ధన్ రాజు తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఓ వృద్ధురాలి సమస్య పరిష్కారమైంది. పెద్దారవీడు మండలం గుండంచర్లకు చెందిన పెద్ద పీరమ్మ తనను ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఎస్పీ మీకోసంలో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించగా ఎస్ఐ సాంబశివయ్య వృద్ధురాలి గృహానికి వెళ్లి ఆమె బాగోగులు చూసుకోవాలని కౌన్సెలింగ్ నిర్వహించారు.