NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ. సాయి చైతన్య ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్ట్రిక్ బార్డర్ చెక్ పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల సమయంలో అనుమానస్పద వ్యక్తుల తనిఖీలు కఠినంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.