E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు గురువారం పర్యటించారు. ఇటీవలే దుద్దుకూరు టీడీపీ సీనియర్ నాయకుడు, మైనార్టీ నేత మొహమ్మద్ అలీ మరణించడంతో వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కలిశారు. కొంతసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రూ. 50వేల ఆర్థిక సహాయం అందజేసి, పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఆయన ఇచ్చారు.