MHBD: తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల పేర్లను ఇవాళ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.