KKD: కాకినాడ దేవాలయ వీధిలోని భీమేశ్వరస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారికి రూ.3,36,879 లక్షల ఆదాయం సమకూరినట్లు EO ఆర్.రాజేశ్వరరావు తెలిపారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వడ్డి ఫణీంద్ర కుమార్ పర్యవేక్షణలో CC కెమెరాల నిఘా నడుమ, భక్తులు, ట్రస్ట్ బోర్డు సభ్యుల సమక్షంలో పారదర్శకంగా ఈ లెక్కింపు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు