NZB: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అక్రమాలు, రౌడీయిజం నియోజవర్గ ప్రజలందరికీ తెలుసని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ బీసీ సెల్ అధ్యక్షుడు దొండి రమణ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీవన్‌రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో చేసిన అక్రమాలు అన్నీఇన్నీ కావన్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.