HYDలో సంచలన ఘటన వెలుగుచూసింది. బీసీలకు అన్యాయం జరుగుతుందని సాయి అనే యువకుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందే సూసైడ్ అటెంప్ట్ చేశాడు. మల్లన్న లేరని చెప్పడంతో బయటకు వచ్చిన అతడు ఆఫీస్ ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు అప్రమత్తమై, మంటలు ఆర్పి అతడిని ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.