NLG: సేవల్లో ముందుండే కంచర్ల బ్రదర్స్ చిట్యాలకు చెందిన అభిమానికి అండగా నిలిచారు. 7వ వార్డుకు చెందిన పాల సూరయ్య చిన్నప్పటి నుంచి కంచర్ల బ్రదర్స్‌కు అభిమానిగా ఉంటూ వస్తున్నాడు. ఇటీవల అనారోగ్యం కారణంతో కాలును కోల్పోయాడు. ఈ విషయాన్ని కంచర్ల కృష్ణారెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డిల దృష్టికి తీసుకెళ్లగా రూ. 1,25,000 ల ఖర్చుతో కృత్రిమ కాలును పెట్టించారు.