MDK: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలలో గురువారం పౌర్ణమి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయం నుంచి రాజగోపురం మీదుగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పల్లకి సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు.