SKLM: జి.సిగడం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 విజయవంతం చేయాలంటూ ప్రత్యేక ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్రిన్సిపాల్ గణేష్ పట్నాయక్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల సమావేశాల వల్ల విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. తల్లిదండ్రుల భాగస్వామ్యంతోనే విద్యా ప్రగతి సాధ్యమని అన్నారు.