కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేది కేశవదాసుపాలెంలో ఉన్న జడ్పీ హైస్కూల్‌ను డిప్యూటీ డీఈవో జి.ప్రకాష్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్లో అన్ని తరగతులలోని విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వందరోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని హెచ్ఎం సత్యవతిని ఆదేశించారు.