ADB: భీంపూర్ మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.