MBNR: జడ్చర్ల పట్టణంలోని డాక్టర్ బీ.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న బొటానికల్ గార్డెన్‌ను బోయపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ సుకన్య వారికి స్వాగతం పలికారు. అనంతరం గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్య విద్యార్థులకు గార్డెన్ యొక్క విశిష్టతను, మొక్కల యొక్క విశిష్టతను వివరించారు.